

|
ద్వారా దైవత్వాన్ని అవాహన చేసి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసారు . ఇప్పటినుండి , విగ్రహాలు అనకూడదు... దేవతా మూర్తులుగా వ్యవహరించాలి .“ - సి. నరసింహాచార్య , ప్రధాన అర్చకులు .
|
|
గత 2 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న దేవాలయ గోపురం, ఇతర మందిరాల నిర్మాణం పూర్తైన సందర్భం పురస్కరించుకొని కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ జూన్ 25 నుండి 29 వరకు చాలా ఘనంగా జరిగాయి. పూల తోరణాలతో ముచ్చటగా ముస్తాబైన దేవాలయం, చలువ పందిళ్ళతో, ముగ్గులతో గుడి ఆవరణ, పట్టు పీతాంబరాలతో దేవతామూర్తులు, బ్రాహ్మణోత్తములతో యాగ వాటికలు, షడ్రుచులతో భోజనశాలలు ఆ నాలుగు రోజులు కళ కళ లాడాయి. ఇక భక్త జన సందోహం హడావుడి చెప్పనక్కర్లేదు. పట్టు వస్త్రాలతో పెద్దలు, తెచ్చి పెట్టుకున్న పెద్దరికంతో పిన్నలు, అల్లరి పిడుగులు, బుజ్జి బుడతలకు దీటుగా భానుడు తన ప్రతాపం చూపించాడు. దేవాలయ కమిటి అకుంఠిత దీక్ష, ఆచార్యుల పవిత్ర ఆశయం, కార్యకర్తల స్వచ్చంద సేవ, భక్తుల ఉత్సాహం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాయి. చూసినవారికి కన్నుల పండుగగా, వేదోచ్చారణతో వీనుల విందుగా జరిగిన అభిషేకం, కళ్యాణం వీక్షణ ఈ జన్మకి దక్కిన భగవదానుగ్రహంగా భక్తులు భావించారు. సామూహికంగా చేసే ప్రతి పనిలో అద్వితీయ ఆనందం, తెలియని ఉత్తేజం ఉంటాయనుకుంటాను. ఈ సందర్భంగా కొందరు భక్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని,............. "మనింట్లో పెళ్లి అంటే, ఎంత బాధ్యతగా చేస్తామో, అంతే బాధ్యత వహించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి" - హేమ రెడ్డి కార్యకర్తలతో .. “ఈ వేద మంత్రాలు హోమాలు , అభిషేకాలు , అర్చనల |
|
కుంభాభిషేకం విశేషాలు |
|
President’s Message |
2 |
|
Opinion |
3 |
|
Experience |
4 |
|
Poem |
5 |
|
Story |
6 & 7 |
|
Forthcoming Events |
8 |
|
|
|
|
మన తెలుగు తేనియలు OTS NEWSLETTER ఒక్లహొమా పత్రిక |
|
August 2009 |
|
సంపుటి:II సంచిక: 2 |
|
మిగతా భాగం 5 వ పేజీలో... |


|
స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు |